లోయలో లారీ బోల్తా : డ్రైవర్‌ మృతి
eenadu telugu news
Updated : 15/09/2021 06:35 IST

లోయలో లారీ బోల్తా : డ్రైవర్‌ మృతి

కూలీల సాయంతో మృతదేహాన్ని బయటకు తెస్తున్న పోలీసులు 

చంద్రగిరి గ్రామీణ: తిరుపతి-మదనపల్లె మార్గంలో భాకరాపేట కనుమదారిలో లారీ అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. లారీ క్యాబిన్‌ పూర్తిగా ధ్వంసమవడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ యజమాని శ్రీనివాసరావు సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన అంజిరెడ్డి(33) ఈనెల 11న సిమెంటు లోడుతో కడప జిల్లా రాయచోటికి వెళ్లాడు. అక్కడి నుంచి సోమవారం సున్నపురాళ్లు లోడ్‌తో గూడూరుకు బయల్దేరాడు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చీకటి కారణంగా సహాయక చర్యలు చేపట్టలేక వెనుదిరిగారు. మంగళవారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తాడు సహాయంతో లోయలోకి దిగారు. సున్నపురాళ్లు, లారీ శకలాలను తొలగించి కూలీల సాయంతో మృతదేహాన్ని అతికష్టం మీద పైకి తీసుకొచ్చారు. లారీ నంబరు కోసం చిమ్మచీకట్లో లోయలోకి దిగిన పోలీసు రక్షక్‌ వాహన డ్రైవర్‌ ఉదయ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ జయచంద్రనాయడు, మృతదేహాన్ని బయటకు తెచ్చిన చంద్రగిరి పోలీస్‌ కానిస్టేబుళ్లు గోపి, వెంకటరమణ, లోకనాథం, ఏఎస్సై రవిని తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. చంద్రగిరి ఎస్సై విజయకుమార్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంజిరెడ్డి (దాచిన చిత్రం)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని