జిల్లాలో వైద్య సదుపాయాలకు రూ.43.56 కోట్లు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

జిల్లాలో వైద్య సదుపాయాలకు రూ.43.56 కోట్లు

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: వైద్యఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు 15వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.43.56 కోట్లు విడుదలయ్యాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఆర్థిక సంఘం నిధులతో వైద్యసంస్థల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నిమిత్తం బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప కేంద్రాల అభివృద్ధి, పీహెచ్‌సీల అభివృద్ధికి రూ.12 కోట్లు విడుదలయ్యాయన్నారు. మరో 543 ఆరోగ్య కేంద్ర భవనాల కోసం నిధులు (ఒక్కో భవనానికి రూ.5.54 లక్షలు) మంజూరు చేశారని పేర్కొన్నారు. బ్లాక్‌ స్థాయి 16 పీహెచ్‌సీలకు రూ.80.96 లక్షలు, 25 వేలకు పైబడి జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో రూ.48.85 లక్షలతో 37 పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. జేసీలు వి.వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీపీవో దశరథరామిరెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీహరి, చిత్తూరు కమిషనర్‌ విశ్వనాథ్‌, పుంగనూరు కమిషనర్‌ లోకేష్‌వర్మ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని