విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుందాం
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుందాం


తిరుపతి ఈఈ చంద్రశేఖరరెడ్డికి ప్రశంసపత్రాన్ని అందజేస్తున్న ఎస్‌ఈ అమరనాథరెడ్డి

చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ అమరనాథరెడ్డి అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీరింగ్‌ దినోత్సవాన్ని బుధవారం చిత్తూరులోని రెవెన్యూ సంఘ సమావేశ భవనంలో నిర్వహించారు. పీఆర్‌ ఇంజినీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని ఇంజినీర్లకు ప్రశంసాపత్రాలను ఎస్‌ఈ అందజేశారు. వారిలో చంద్రశేఖరరెడ్డి(ఈఈ, తిరుపతి), డీఈఈలు పద్మ(సర్కిల్‌ ఆఫీస్‌, చిత్తూరు), ప్రభాకరరెడ్డి(తిరుపతి), మహేష్‌కుమార్‌(పూతలపట్టు), నాగరాజు (పలమనేరు), ఉమాశంకర్‌ (విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌, చిత్తూరు) ఏఈఈలు శోభారాణి (తిరుపతి), వీరభద్రయ్య (విజయపురం), శరణ్య (శ్రీకాళహస్తి), జయచంద్రారెడ్డి(గుడిపాల), రమణయ్య(పూతలపట్టు), రామకృష్ణనాయక్‌ (పులిచెర్ల), సుభ్రత్‌(కేవీపల్లె), రవిశంకర్‌(విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌, చిత్తూరు), ఇంజినీరింగ్‌ అసిస్టెంట్స్‌ ఏలుమలై (వీకేపురం, నగరి), మనీషా (గాజులమండ్యం, రేణిగుంట), పూజిత (తనపల్లె, తిరుపతి గ్రామీణ), సునీల్‌కుమార్‌ (నెల్లేపల్లె, జీడీనెల్లూరు), భానుప్రకాష్‌ (శివునికుప్పం, వి.కోట), హర్షిత (బందార్లపల్లె, రామకుప్పం), అశోక్‌కుమార్‌ (కొత్తవారిపల్లె-2, మదనపల్లె), నవ్య (మిట్ట చింతపల్లె, పుంగనూరు), నాగేశ్వర (ఎర్రకోటపల్లె, కలకడ) ఉన్నారు. ఈఈలు చంద్రశేఖరరెడ్డి, రవణయ్య, శంకర నారాయణ, డీఈఈలు, ఏఈఈలు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని