ఈకేవైసీకి ముగిసిన గడువు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

ఈకేవైసీకి ముగిసిన గడువు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కార్డుల్లో సభ్యులుగా ఉన్న పెద్దలకు ఈకేవైసీ గడువు బుధవారంతో ముగిసింది. జిల్లాలో 5,03,120 మందిని ఈకేవైసీకి గుర్తించారు. ఇప్పటివరకు 1,79,723 మంది (36%) ఈకేవైసీ నమోదు చేశారు. మరో 3,23,397 మంది ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. అయిదేళ్లు నిండిన పిల్లలలకు ఆధార్‌ ఆప్‌డేట్‌, ఈకేవైసీ నమోదుకు నెలాఖరు వరకు అవకాశం ఉంది. దీంతో పిల్లలతో తల్లిదండ్రులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. వాలంటీర్లు, సచివాలయాల వద్ద పెద్దలకు ఈకేవైసీ నమోదు వెసులుబాటు ఉన్నప్పటికీ నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అదికాస్తా ముందుకు సాగడం లేదు. వలస వెళ్లిన, వేలిముద్ర పడని సభ్యులకు ఈకేవైసీ నమోదుపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి నమోదు గడువును పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని