ప్రశాంతంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

ప్రశాంతంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తిరుపతి ఎస్వీ జూనియర్‌ కళాశాల కేంద్రంలో మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థులు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడేఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 133 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలకు 48,729 మందికి 37,159 మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 48,533 మందికి గాను 572 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్‌ఐవో వి.శ్రీనివాసులరెడ్డి, డీవీఈవో రఘుపతి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని