జిల్లా వాసులకు స్థానం
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

జిల్లా వాసులకు స్థానం

తితిదే పాలక మండలిలో


పోకల అశోక్‌కుమార్‌, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, బీరేంద్రవర్మ

ఈనాడు - తిరుపతి, న్యూస్‌టుడే, కల్లూరు: తితిదే పాలక మండలిలో జిల్లాలో పలువురికి స్థానం దక్కింది. పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లెకు చెందిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల అశోక్‌కుమార్‌కు అవకాశం కల్పించారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరు కావడంతో ఈ పదవి దక్కినట్లు తెలుస్తోంది. తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమితులయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన బీరేంద్రవర్మకు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌ పదవి కేటాయించగా.. స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొనడంతో ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఇప్పుడు ఆయన్ను తితిదే ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. నూతన సభ్యుడు అశోక్‌ 1987లో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. 1998, 2005లలో వెంకటదాసరిపల్లె ఎంపీటీసీగా గెలుపొందారు. 1998లో మండల ఉపాధ్యక్షుడిగా, 2006లో పులిచెర్ల జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. తెదేపా, ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో పనిచేసి 2013లో వైకాపాలో చేరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని