మార్కెట్‌లోకి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

మార్కెట్‌లోకి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు


సమావేశంలో మాట్లాడుతున్న తితిదే ఈవో జవహర్‌రెడ్డి

తిరుపతి(విద్య): తితిదే ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను డిసెంబర్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆయుష్‌ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద ఆయుర్వేద ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు పదేళ్లపాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసి తితిదేకి అందజేస్తుందని వివరించారు. తితిదే వాడగా మిగిలినవి విక్రయాలకు పెట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని గోశాల నుంచి భాకరాపేట, పలమనేరులోని గోశాలలకు గోవుల తరలింపు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి కావాలన్నారు. తితిదే స్థానిక, అనుబంధ ఆలయాల్లో భక్తులు గోపూజ, వేదాశీర్వచనం చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం సాయంత్రం ఆలయాల అభివృద్ధిపై సీనియర్‌ అధికారులు, ఆయా ఆలయాల డిప్యూటీ ఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికాలయాలు, స్వాధీనం చేసుకున్న ప్రతి ఆలయంలో ఒక ప్రత్యేక సేవ ప్రారంభించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని