అనుమానమే పెనుభూతమై..
eenadu telugu news
Updated : 16/09/2021 13:13 IST

అనుమానమే పెనుభూతమై..

మదనపల్లెలో మహిళ హత్య


గాయత్రి (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అనుమానమే పెనుభూతమై భార్యను భర్త కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన మదనపల్లెలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సీటీఎం రోడ్డు ఈస్ట్‌పేటకు చెందిన ఎ.లోకేశ్‌, అదే ప్రాంతానికి చెందిన గాయత్రి(30) 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నిషిత(8) కుమార్తె ఉంది. వీరిద్దరు తరచూ గొడవ పడుతుండటంతో పెద్దలు మందలించారు. దీంతో లోకేశ్‌ శివాజీనగర్‌కు కాపురం మార్చాడు. గాయత్రి ఇక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఆమె చనువుగా ఉంటోందని లోకేశ్‌ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కూరగాయలు కోసే కత్తితో ఆమెను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మదనపల్లె రెండో పట్టణ సీఐ నరసింహులు, ఎస్సై చంద్రమోహన్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు లోకేశ్‌ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని