‘విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు చర్యలు’
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

‘విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు చర్యలు’


దేవేంద్రరెడ్డిని సత్కరిస్తున్న యూనియన్‌ ప్రతినిధులు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌(1104) రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కార్యదర్శి గణపతి ఆరోపించారు. బుధవారం తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆ యూనియన్‌ 11వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. డిస్కం కార్యదర్శి దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ సమస్యల సాధనకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపు ఇచ్చారు. వినియోగదారులపై విధిస్తున్న ట్రూఅప్‌ ఛార్జీలపై ఆయన విమర్శలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగదీష్‌, దేవేంద్రరెడ్డి, కృష్ణమూర్తి, ప్రభుదాసు, వెలకటూరి గోపి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం: యూనియన్‌ (1104) డిస్కం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌, కార్యదర్శిగా దేవేంద్రరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులను తిరుపతి డివిజన్‌ కమిటీ నేతలు సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని