నీతులు చెప్పే స్థాయి వైకాపాకు లేదు: సోము వీర్రాజు
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

నీతులు చెప్పే స్థాయి వైకాపాకు లేదు: సోము వీర్రాజు


కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సోము వీర్రాజు, పార్టీ నాయకులు

తిరుపతి (గాంధీరోడ్డు): మంత్రి అప్పలరాజుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ రాస్తే, సోము వీర్రాజు సంతకం పెట్టారన్న మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. తిరుపతిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా తోక పార్టీగా మారిపోయిందన్న మంత్రి మాటలు అర్థరహితమని విమర్శించారు. రాష్ట్రంలోని కుటుంబ పార్టీలే తోక పార్టీలన్నారు. మీ తోకలు మీరే కత్తిరించుకోవాల్సిన రోజులు వస్తాయి.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి అప్పలరాజుకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవ-సమర్పణ’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. l తితిదే పాలకమండలి సభ్యుల నియామకాల్లో సంఖ్యకు మించి నియామకాలు చేపడితే ఆందోళన చేస్తామని వీర్రాజు పేర్కొన్నారు. ఇష్టమొచ్చినట్లు పెంచడానికి పాలకమండలి సభ్యుల జాబితానా? లేక ఓటర్ల జాబితానా? అని ప్రశ్నించారు. కేంద్ర సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చేతనైతే క్రిస్టియన్‌ ఛారిటీస్‌పై పెత్తనం చేయగలరా అని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని