ఐదు నెమళ్లు మృతి
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

ఐదు నెమళ్లు మృతి

కలికిరి గ్రామీణ: కలికిరి మండలం నరావాండ్లపల్లె సమీపంలోని రాగిమానికుంట వద్ద బుధవారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. అటవీ, పశువైద్యశాఖల అధికారులు, వైద్యులు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వాటిని కలికిరి రెడ్డివారిపల్లెలోని పశువైద్యశాలకు తరలించి సర్పంచి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నెమళ్ల పొట్టలోని అవశేషాలను తిరుపతి పశువైద్యశాలలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అనంతరం కళేబరాలపై జాతీయజెండాను కప్పి నివాళి అర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విషపూరితమైన ఆహారం తినడం వల్లే అవి చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని