తితిదే కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు?
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

తితిదే కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు?

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తిరుపతిలోని తితిదే జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతిలోని ఎస్వీ జూనియర్‌ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం కళాశాల, హాస్టల్‌కు ఈనెల 22 నుంచి నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్లు తితిదే విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తితిదే అధికారికరంగా సోమవారం ప్రకటించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని