కూలిన స్వాగత తోరణం
eenadu telugu news
Updated : 20/09/2021 06:17 IST

కూలిన స్వాగత తోరణం


ప్రమాదానికి కారణమైన లారీ.. దెబ్బతిన్న కారు

తిరుపతి (తాతయ్యగుంట), న్యూస్‌టుడే: తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో తితిదే ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. బస్టాండు వైపు వస్తున్న ఓ టిప్పర్‌ హెడ్రాలిక్‌ పంపు పైకి లేవడంతో వెనుకభాగం తోరణానికి తగలడంతో నేలకొరిగింది. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని కూడలి వైపు వస్తున్న కర్ణాటక భక్తుల కారుపై తోరణం పడటంతో వాహనం ముందుభాగం దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఆఫ్కాన్‌ సంస్థ సహకారంతో తోరణాన్ని తొలగించారు. రేణిగుంట-తిరుపతి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని