తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం


శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నానం చేయిస్తున్న అర్చకులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఏకాంతంగా జరిగింది. శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకించారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంతపద్మనాభ వ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని