వైభవంగా వరసిద్ధుని ఏకాంతసేవ
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

వైభవంగా వరసిద్ధుని ఏకాంతసేవ


రథహారతి అందుకుంటున్న స్వామివారు

కాణిపాకం, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వైభవంగా వినాయక స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు. కాణిపాకానికి చెందిన కె.సోమశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. సర్వాలంకృతులైన సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయస్వామి వారిని అలంకార మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఎండు ఫలాలు, బాదంపాలు నైవేద్యంగా సమర్పించారు. ఆచార్యోత్సవంలో భాగంగా ఆలయ ఈవో ఎ.వెంకటేశును అర్చక, వేదపండితులు, అధికారులు, సిబ్బంది గజమాలతో ఘనంగా సత్కరించారు. కాణిపాకం సర్పంచి కె.శాంతిసాగర్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు. ప్రత్యేకోత్సవాల్లో సోమవారం రాత్రి స్వామివారికి అధికారనంది వాహనసేవ నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని