మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి


సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

తిరుపతి(గాంధీరోడ్డు): బ్రిటిష్‌ పాలకులతో మన పూర్వీకులు పోరాడి సాధించిన ఆస్తులను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తాకట్టుపెట్టడానికి ప్రయత్నిస్తోందని, వాటిని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి యువత సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో ఆదివారం నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాగాంటి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వనరులను కేంద్రానికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం ఉందని ఆరోపించారు. సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌, నాయకులు నవీన్‌ కుమార్‌రెడ్డి, వెంకట నరసింహులు, ప్రభాకర్‌, లీలా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని