ధార్మిక క్షేత్రంలో శ్రమదోపిడీ
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

ధార్మిక క్షేత్రంలో శ్రమదోపిడీ

తితిదేపై బృందాకారాట్‌ ఆగ్రహం


మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌

మంగళం(తిరుపతి), న్యూస్‌టుడే: తితిదే లాంటి ధార్మికక్షేత్రంలో కార్మికుల శ్రమదోపిడీ జరుగుతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ ధ్వజమెత్తారు. తిరుపతి నగరంలోని తితిదే అటవీ కార్యాలయం ఎదుట అటవీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించి, కార్మికులకు మద్దతు పలికారు. బృందాకారాట్‌ మాట్లాడుతూ.. పది నెలలుగా రిలే దీక్షలు చేస్తున్నా తితిదే యాజమాన్యం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పినా.. తితిదేలో అమలు కాకపోవడానికి కారణం ఏమిటో ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. భక్తులు, ఉద్యోగుల గురించి పట్టించుకోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 81 మందితో జంబో బోర్డును ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నాయకులు వి.నాగరాజు, జయచంద్ర, నాగార్జున, సాయిలక్ష్మి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని