ఎలుగుబంటి దాడిలోగొర్రెల కాపరికి తీవ్రగాయాలు
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

ఎలుగుబంటి దాడిలోగొర్రెల కాపరికి తీవ్రగాయాలు

108లో నారాయణప్పను కుప్పం తరలిస్తున్న సిబ్బంది

సంగనపల్లె (గుడుపల్లె): మండలంలోని పెద్దపర్తికుంట గ్రామానికి చెందిన నారాయణప్ప ఆదివారం తన గొర్రెలను అడవిలోకి మేతకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టుచాటునున్న ఎలుగుబంటి అమాంతం అతనిపై పడి దాడి చేసింది. బిగ్గరగా కేకలేయడంతో సమీపంలోని పశువుల కాపరులు రాగా ఎలుగుబంటి పారిపోయింది. తీవ్రగాయాలైన నారాయణప్పను 108లో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని