జడ్పీ పదవులు కొలిక్కి
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

జడ్పీ పదవులు కొలిక్కి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: జిల్లా పరిషత్‌ పదవులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని అన్ని జడ్పీటీసీలను కైవసం చేసుకున్న వైకాపా పదవులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. జడ్పీ ఛైర్మన్‌గా వి.కోట జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు(వాసు) పేరు ఇది వరకే ఖరారు చేయగా.. తాజాగా ఉపాధ్యక్ష పదవులపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల పరంగా తీసుకొచ్చిన చట్టంలో మార్పు కారణంగా ఉపాధ్యక్ష పదవులు రెండుగా ఏర్పడ్డాయి. యాదమరి జడ్పీటీసీ సభ్యుడు ధనుంజయరెడ్డి, గుడిపాల నుంచి రమ్య, పుత్తూరు జడ్పీటీసీ సభ్యురాలు దేవి పేరు వినిపిస్తోంది. ఛైర్మన్‌ అభ్యర్థి శ్రీనివాసులుకు పార్టీ బి.ఫారం గురువారం అందజేసినట్లు సమాచారం. జడ్పీ పదవుల ఎన్నిక చిత్తూరులో శనివారం జరగనున్న నేపథ్యంలో యంత్రాంగం సన్నాహాలు చేపట్టింది. కలెక్టరు హరి నారాయణన్‌ అధ్యక్షతన జరిగే ఈ ప్రక్రియలో ఇదే రోజు కో- ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. చిత్తూరు సమీపంలోని ఓ మండలం నుంచి మైనార్టీ వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

ఎన్నికల పరిశీలకుడిగా అర్జునరావు.. చిత్తూరు జడ్పీ, న్యూస్‌టుడే: మండల, జిల్లా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన చేనేత కమిషనర్‌ అర్జునరావు గురువారం చిత్తూరు వచ్చారు. ఆయన్ను జేసీ రాజాబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎన్నికల నిర్వహణపై పరిశీలకులు వీరితో కాసేపు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని