కష్టాలు కనవా స్వామీ!
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

కష్టాలు కనవా స్వామీ!

తిరుపతి శ్రీనివాసం భక్తుల వసతి సముదాయంలో ఈ నెల 8 నుంచి తితిదే ఉచిత సర్వదర్శన టోకెన్లను భక్తులకు అందజేస్తోంది. 22 తేదీ రాత్రి, 24,25 తేదీలకు సైతం టోకెన్లు అందజేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు బుధవారం రెండ్రోజుల తర్వాత దర్శనానికి ఉచిత టోకెన్లు ఇవ్వడంతో ఇంటికి వెళ్లలేక ఇక్కడ ఉండలేక అవస్థలు పడుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున వర్షం కురవడంతో మాధవం, శ్రీనివాసం భక్తుల వసతి సముదాయాల ఆవరణలో నిద్రిస్తున్న భక్తులు.. సాంస్కృతిక కార్యక్రమాల మండపంలోకి చేరి ఇలా సేద దీరారు. -ఈనాడు, తిరుపతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని