కన్నేసి.. కప్పేస్తే.. తొలగించారు..
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

కన్నేసి.. కప్పేస్తే.. తొలగించారు..


ఆక్రమణ తొలగింపును పర్యవేక్షిస్తున్న అధికారులు

ఈనాడు-తిరుపతి: రాజకీయ పలుకుబడితో తిరుపతి గ్రామీణ మండలం దామినేడు పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేసిన ప్రహరీలను రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం తొలగించారు. ఈ అక్రమాలపై ‘కన్నేసి...కప్పేసి’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఇందులో ఏడబ్ల్యూడీ భూములతో పాటు కాలువ ఉంది. యంత్రాంగం పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి 112/1, 112/2, 112/3 సర్వే నంబర్లలోని భూములతో పాటు 136/2, 94/2 సర్వే నంబరులోని కాలువ ఆక్రమణలను తొలగించారు. తహసీల్దారు లోకేశ్వరి ఆధ్వర్యంలో పోలీస్‌ రెవెన్యూ సిబ్బంది గురువారం ఆక్రమణలను కూల్చివేశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని