అభివృద్ధి మాటున రైతులకు అన్యాయం: విశ్వం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

అభివృద్ధి మాటున రైతులకు అన్యాయం: విశ్వం


మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం, వేదికపై నారాయణ తదితరులు

చిత్తూరు గ్రామీణ: ప్రభుత్వాలు అభివృద్ధి పేరు చెప్ఫి. ప్రజలు, రైతుల్ని దోచుకోవడం అన్యాయమని సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం అన్నారు.చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారి భూ నిర్వాసితుల అవగాహన సదస్సు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజన్‌ అధ్యక్షతన గురువారం చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారి ప్రజాభిప్రాయం లేకుండా భూ సేకరణ జరిగిందన్నారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులు సెల్యూట్‌ కొడుతున్నారని, కొందరు రాజకీయ నాయకుల ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారన్నారు. అదానికి చెందిన గుజరాత్‌ పోర్టు నుంచే ఏపీకి హెరాయిన్‌ దిగుమతి అవుతోందని ఆరోపించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్‌, నరసింహులు, రైతు సంఘం ఐక్యవేదిక నాయకులు శ్రీనివాసులనాయుడు, దేవరాజ్‌నాయుడు, గోపి, గుర్రప్ప, రేవతి, సుశీల, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ, రైతులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని