తితిదే ఛైర్మన్‌ కార్యాలయం పేరిట నకిలీ సందేశాలు
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

తితిదే ఛైర్మన్‌ కార్యాలయం పేరిట నకిలీ సందేశాలు

శ్రీవారి దర్శనం కల్పిస్తామని మోసగించిన వ్యక్తి అరెస్టు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తులను మోసగించిన ఓ నిందితుడిని తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు.. భువనగిరికి చెందిన వెంకటేష్‌ శ్రీవారి దర్శనం చేసుకోవాలని తిరుపతికి చెందిన నాగరాజు అనే దళారిని ఆశ్రయించాడు. 11 మందికి రూ.300 దర్శనం టికెట్లు ఇప్పించాలని కోరగా అందుకు నాగరాజు రూ.16,500 అవుతుందని చెప్పాడు. మొదటి విడతగా ఫోన్‌పేలో రూ.8 వేలు భక్తుడు పంపాడు. అనంతరం తిరుపతికి చేరుకున్న భక్తుడు వెంకటేష్‌కు మరో వ్యక్తితో కలిసి నాగరాజు తితిదే ఛైర్మన్‌ కార్యాలయం పేరిట గతంలో వచ్చిన మెసేజ్‌ను మార్చి వారి పేరుతో పంపాడు. తిరుమల వచ్చిన వెంకటేష్‌ ఛైర్మన్‌ కార్యాలయాన్ని సంప్రదించగా సదరు మెసేజ్‌ నకిలీదిగా సిబ్బంది గుర్తించి భక్తుడికి తెలిపారు. ఈ మేరకు బాధితుడు తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడు నాగరాజును అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని