పట్టణాభివృద్ధి సంస్థలపరిధి పెంపు
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

పట్టణాభివృద్ధి సంస్థలపరిధి పెంపు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోకి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాలను చేరుస్తూ పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బి.కొత్తకోట నగర పంచాయతీ సహా ఈ ఆరు మండలాల్లోని 78 గ్రామాలను పీకేఎం ఉడాలో చేర్చడంతో విస్తీర్ణం 3,875.08 చ.కి.మీ.కు పెరిగింది. చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ(చుడా) పరిధిలోకి పీలేరు నియోజకవర్గంలోని కలకడ, గుర్రంకొండ, కేవీపల్లె మండలాల్లోని 48 గ్రామాలను చేర్చడంతో దాని విస్తీర్ణం 4,163.57 చ.కి.మీ.కు చేరింది.

తుడాలోకి యర్రావారిపాళెం మండలం

తిరుపతి (నగరపాలిక): తుడా పరిధిలోకి యర్రావారిపాళెం మండలంలోని 12 గ్రామాలను చేర్చడంతో విస్తీర్ణం 185 చ.కి.మీ.కి పెరిగింది. మండలం ఏ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి రాకపోవడంతో కేంద్రం అందించే పక్కాగృహ నిర్మాణ పథకం వినియోగించుకోలేకపోతున్నామని ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో తుడా పరిధిలోకి తెచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని