ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం

●గొడవకు దిగిన వైకాపాలోని రెండు వర్గాలు

●అడ్డుకున్న రెవెన్యూ యంత్రాంగం

ఆక్రమణ విషయమై గొడవ పడుతున్న ఇరువర్గాలు

మంగళం(తిరుపతి): మంగళం సమీపంలోని చెన్నాయగుంట లెక్కదాఖలా సర్వేనంబర్‌ 222/5 లోని ప్రభుత్వ, కాలువ పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి గురువారం వైకాపాకు చెందిన నాయకులు రెండు వర్గాలుగా మారి తమ అనుచరులతో ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు శ్రీధర్‌, సుమన్‌, భూపతి సంఘటన స్థలానికి పోలీసులతో చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. సర్వేనంబర్‌ 222/5లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ, కాలువ పొరంబోకు స్థలం ఉందని.. ఇందులో ఎవ్వరు ప్రవేశించినా చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు. జీవకోనకు చెందిన వైకాపా ముస్లిం మైనారిటీ నాయకుడు తమకు పట్టాలు ఉన్నందున స్థలం తమకే చెందుతుందని అధికారులతో వాదనకు దిగాడు. మార్కెకమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న వైకాపా నాయకుడు తాము స్థలాన్ని యజమాని నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని వాదించారు. రెవెన్యూ సిబ్బంది అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణకు విషయం చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన భూమి ప్రభుత్వ, కాలువ పొరంబోకని ఎవరు పట్టాలిచ్చినా చెల్లవని తేల్చి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని