బాలుడి అపహరణకు యత్నం
eenadu telugu news
Published : 24/09/2021 04:12 IST

బాలుడి అపహరణకు యత్నం

చంద్రగిరి గ్రామీణ: పదకొండేళ్ల్ల బాలుడిని కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆ తరువాత వదిలి వెళ్లిన సంఘటన చంద్రగిరిలో చోటు చేసుకుంది. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు.. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన రాజారెడ్డి కుమారుడు గుణశేఖర్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఐతేపల్లిలోని మేనమామ రామనాథరెడ్డి ఇంటికి వెళ్లిన గుణశేఖర్‌.. ఆయనతో కలిసి మేకల దొడ్డి వద్ద నిద్రించాడు. గురువారం వేకువజామున 5 గంటలకు రామనాథరెడ్డి నిద్రలేచి సమీపంలోని ఇంటికి వెళ్లగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి నోటికి గుడ్డ కుక్కి బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లారు. పూతలపుట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై బాలుడ్ని తీసుకు వెళుతుండగా.. చంద్రగిరి సమీపంలోని నాగాలమ్మ కూడలి వద్దకు రాగానే అటు వైపు వచ్చిన పోలీసు వాహనాన్ని చూసి బాలుడిని విడిచిపెట్టి పరారయ్యారు. ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని