TTD: సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన
eenadu telugu news
Updated : 24/09/2021 17:25 IST

TTD: సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని తితిదే అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసం వసతి గృహం నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు యత్నిస్తున్నారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. భక్తుల ఆందోళనతో శ్రీనివాసం వసతిగృహం వద్ద పోలీసులు మోహరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని