తొలి స్నాతకోత్సవం  రేపు
eenadu telugu news
Updated : 19/10/2021 05:57 IST

తొలి స్నాతకోత్సవం  రేపు

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం
 
మాట్లాడుతున్న వీసీ మురళీధర శర్మ

తిరుపతి(విద్య): తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య వి.మురళీధరశర్మ తెలిపారు. వర్సిటీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహతి కళాక్షేత్రంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్యఅతిథులుగా భారత మాజీ ఎన్నికల ప్రధానాధికారి, వర్సిటీ కులపపతి ఎస్‌.గోపాలస్వామి, మహామహోపాధ్యాయ భద్రేష్‌ దాస్‌ హాజరవుతారన్నారు. 1160 మందికి పట్టాలు అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కమాండర్‌ చల్లా వేంకటేశ్వర్‌, పబ్లిసిటీ కమిటీ కన్వీనర్‌ దక్షిణామూర్తి శర్మ, ఛైర్మన్‌ చక్రవర్తి రాఘవన్‌, నందన్‌భట్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని