మహిళా పోలీసులకు యుద్ధవిద్యలు
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

మహిళా పోలీసులకు యుద్ధవిద్యలు

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా ఎస్‌ఐకు ధ్రువపత్రం అందిస్తున్న ప్రిన్సిపల్‌ అశోక్‌బాబు

చంద్రగిరి గ్రామీణ: కరుడుగట్టిన నేరస్థులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మహిళా పోలీసులకు యుద్ధవిద్యలు అవసరమని పీటీసీ ప్రిన్సిపల్‌ అశోక్‌బాబు పేర్కొన్నారు. 20 రోజులుగా మహిళా పోలీసులకు యుద్ధవిద్యలపై ఇచ్చిన శిక్షణ ముగియడంతో సోమవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతకాలం రిజర్వు పోలీసు విభాగంలో మహిళలకు అవకాశం లేేదని, ప్రస్తుతం పురుషులతో సమానంగా వారికి ప్రాధాన్యం కల్పిస్తూ ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ మునిరాజ, డీఎస్పీ రామకృష్ణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని