శేషాచలంపై నిఘా పెంచండి: డీఐజీ
eenadu telugu news
Published : 19/10/2021 05:48 IST

శేషాచలంపై నిఘా పెంచండి: డీఐజీ

అధికారులతో మాట్లాడుతున్న డీఐజీ కాంతిరాణటాటా

మంగళం(తిరుపతి): శేషాచలం అడవుల్లో కట్టుదిట్టమైన భద్రత అమలు చేయాలని, నిఘా వ్యవస్థలు బలోపేతం చేయాలని డీఐజీ కాంతిరాణటాటా ఏపీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సోమవారం ఆయన టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు, అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో కలిసి ఎర్రచందనం సంరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేషాచలం అడవిలోకి తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించే మార్గాలపై నిఘా పెంచాలన్నారు. ఎక్కువగా ఎర్రచందనం పట్టుబడిన ప్రదేశాలు, స్మగ్లర్లు అడవిలోకి రాకపోకలు సాగించిన మార్గాలను గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలో వివరించారు. సమావేశంలో డీఎస్పీ మురళీధర్‌, అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని