విమాన సర్వీసులు పెంచాలి
eenadu telugu news
Updated : 19/10/2021 06:05 IST

విమాన సర్వీసులు పెంచాలి

సమావేశంలో ఎంపీ గురుమూర్తి, ఏపీడీ సురేష్‌ తదితరులు

రేణిగుంట, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని ఎంపీ, అంతర్జాతీయ విమానాశ్రయ సలహా కమిటీ అధ్యక్షుడు గురుమూర్తి విమాన సర్వీసు ఆపరేటర్లను కోరారు. సోమవారం ఆయన అధ్యక్షతన విమానాశ్రయ అభివృద్ధి సలహా కమిటీ సమావేశాన్ని రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురై, వారణాసి, చెన్నై, అహ్మదాబాద్‌, వైజాగ్‌, విజయవాడ, రాజమహేంద్రవరానికి విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికులకు హోటల్‌, తితిదే దర్శన బుకింగ్‌కు విమానాశ్రయంలో కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. బోయింగ్‌ విమానాలు దిగేందుకు రన్‌ వే విస్తరణ చర్యలు చేపట్టాలన్నారు. వివిధ ఎయిర్‌లైన్స్‌ అధికారులు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, తమిళనాడులోని మధురైకు నేరుగా ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఏపీడీ సురేష్‌, సలహా కమిటీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని