దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి
eenadu telugu news
Published : 19/10/2021 05:50 IST

దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి

తిరుపతి(విద్య): తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సుకు దరఖాస్తులు ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తామని ఫార్మసీ విభాగాధిపతి జి.కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. సోమవారం కళాశాలలోని ఫార్మసీ విభాగంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు సొంతంగా ఫార్మసీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇంటర్‌ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌లో బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులన్నారు. హాజరయ్యే విద్యార్థులు వారి విద్యార్హత ఒరిజినల్‌ పత్రాలు, రెండు సెట్ల జిరాక్స్‌, ఫొటోలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 98482 17166, 95536 29005కు సంప్రదించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని