ఆనందం ఆవిరి..
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

ఆనందం ఆవిరి..

అత్తాకోడళ్ల దుర్మరణం


రాజేశ్వరమ్మ, భార్గవిలత 

తిరుచానూరు, న్యూస్‌టుడే: బంధువుల వివాహసంబంధ కార్యక్రమానికి హాజరై ఆనందంగా తిరుగు ప్రయాణమైన వారిని విధి చిన్నచూపు చూసింది. లారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో అత్తాకోడలు చనిపోగా.. భర్త ప్రాణాలతో బయటపడ్డారు. తిరుపతిలోని పద్మావతిపురం కేఆర్‌నగర్‌లో పరమాల రవి, ఆయన తల్లి రాజేశ్వరమ్మ(65), భార్య భార్గవి లత(46) నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన శుభ కార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ప్రమాదం జరిగి రాజేశ్వరమ్మ, భార్గవిలత అక్కడికక్కడే మృతిచెందగా.. రవి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భార్గవిలత నిండ్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్‌ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు నిఖిత, నేహా కుమారైలు. నేహా ఒక్కరే ఒంటరిగా ఇంట్లో ఉండటంతో తల్లి మృతిచెందిన విషయాన్ని ఆమెకు చెప్పలేదు. అత్తాకోడళ్లు అన్యోన్యంగా ఉండేవారని.. రాజేశ్వరమ్మ కొంతకాలం చిన్నకొడుకు రవి దగ్గర ఉండేదని, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పెద్దకుమారుడి వద్ద ఉంటోందని స్థానికులు తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని