నత్తనడకన ఈకేవైసీ
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

నత్తనడకన ఈకేవైసీ

చిత్తూరు (వ్యవసాయం): రైతుల ప్రయోజనార్థం రూపొందించిన ఈ-పంట నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగైన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి ఈ-పంట నమోదులో రైతుల వేలిముద్రల అనుసంధానం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని 946 రైతు భరోసా కేంద్రాల్లో 3,09,471 మంది రైతులు 2,66,930 హెక్టార్లలో సాగు చేసినట్లు పేర్లు నమోదు చేసుకున్నారు. పంటల సాగు క్షేత్ర పరిశీలన(ఫీల్డ్‌ వెరిఫికేషన్‌) 93 శాతం పూర్తయింది. రైతుల ఈకేవైసీ 84 శాతం పూర్తయింది. వాస్తవంగా ఈ నెల 15లోగా పూర్తి చేయాలని తొలుత ఉత్తర్వులిచ్చారు. కొన్ని ఆర్‌బీకే పరిధిలో అధిక విస్తీర్ణంలో సాగు, సర్వర్‌ సమస్యల వల్ల ఈకేవైసీ ముందుకు సాగలేదు. ఫలితంగా పంట నూర్పిడులు మొదలైనప్పటికీ ఈ-పంట ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని గడువు విధించారు. పంట క్షేత్ర పరిశీలన దాదాపు పూర్తయిందని రైతుల వేలిముద్రలతో త్వరగా ఈకేవైసీ పూర్తి చేస్తామని జేడీఏ దొరసాని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని