తిరుమలై కల్లర్‌ స్థితిగతుల పరిశీలన
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

తిరుమలై కల్లర్‌ స్థితిగతుల పరిశీలన


మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ శంకరనారాయణ

చింతలపట్టడ (నగరి), న్యూస్‌టుడే: జిల్లాలో తమిళనాడుకు చెందిన తిరుమలై కల్లర్‌ కులానికి సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించడానికి స్వయంగా వచ్చినట్లు రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకరనారాయణ పేర్కొన్నారు. నగరి మున్సిపాలిటీ చింతలపట్టడలోని లింగేశగుంట వద్ద మంగళవారం బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు నుంచి సుమారు 40 సంవత్సరాల కిందట చిత్తూరు జిల్లాకు వలస వచ్చి స్థిరపడిన తిరుమలై కల్లర్‌ కులస్థుల స్థితిగతులను పరిశీలించనున్నామన్నారు. నగరి మున్సిపాలిటీలో 20 కుటుంబాలు 94 మంది సభ్యులు జీవిస్తున్నారని తహసీల్దారు చంద్రశేఖరరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. వారితో చర్చించారు. తమిళనాడులో తమకు బీసీ కుల ధ్రువపత్రం అందిస్తున్నారని, ఏపీలో తమ కులాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదన్నారు. వివరాలు సేకరించి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. బహిరంగ సభకు బీసీ కమిషన్‌ సభ్యులు మారక్కగారి క్రిష్ణప్ప, వెంకట సత్య దివాకర్‌ పక్కి, అవ్వారు ముసలయ్య, సభ్య కార్యదర్శి డి.చంద్రశేఖరరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి కుష్బూ, సహాయ బీసీ సంక్షేమాధికారి మునిబాబు హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని