గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి

ఏపీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు

శిక్షణ తరగతులనుద్దేశించి మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్‌ మురళి

తిరుపతి(గ్రామీణ), న్యూస్‌టుడే: వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్‌ జె.మురళి అన్నారు. తిరుపతి గ్రామీణ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డు సభ్యులు గ్రామసభలకు తప్పకుండా హాజరవ్వాలని సూచించారు. అక్కడ తీసుకునే నిర్ణయాలు గ్రామాల అభివృధ్ధికి తోడ్పడుతాయని చెప్పారు. గ్రామాల్లోని ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. డీపీవో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పాలనపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకుంటేనే వార్డుల్లో అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న సభ్యులకు ఎంపీడీవో వెంకటనారాయణ ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌ అమరనాథ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ మధుసూదన్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరాజు, ప్రసాద్‌శర్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని