‘విద్యుత్తు కోతలతో అభివృద్ధికి ఆటంకం’
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

‘విద్యుత్తు కోతలతో అభివృద్ధికి ఆటంకం’


మాట్లాడుతున్న తెదేపా చంద్రగిరి నియోజకవర్గ బాధ్యుడు పులివర్తి నాని

తిరుపతి(గ్రామీణ), న్యూస్‌టుడే: వ్యవసాయ బోర్లకు విద్యుత్తు మీటర్లు బిగిస్తే రైతు మెడకు ఉరితాడు బిగించినట్లేనని తెదేపా చంద్రగిరి నియోజకవర్గ బాధ్యులు పులివర్తి నాని అన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలకు నిరసనగా అవిలాల, గాంధీపురం పంచాయతీల్లో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా అభివృధ్ధి చెందాలంటే విద్యుత్తు సరఫరా బాగుండాలన్నారు. తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు యూనిట్‌ రూ.4.50 కొన్నారని... వైకాపా ప్రభుత్వం కమీషన్లకు పాల్పడి యూనిట్‌ రూ.6 నుంచి రూ.11కు కొంటోందని ఆరోపించారు. రూ.300 వస్తున్న ఇంటి విద్యుత్తు ఛార్జీలు ఇప్పుడు రూ.700 వస్తోందని వాపోయారు. విద్యుత్తు సరఫరా లేని కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, నాయకులు సాంబశివయ్య, కృష్ణమూర్తిరెడ్డి, కత్తి సుధాకర్‌, శ్రీరామ్‌, హరి, బిరుదాల భాస్కర్‌రెడ్డి, మధు, శ్రీనివాసులు, అవిలాల, గాంధీపురంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని