అయోడిన్‌ ప్రయోజనాలపై అవగాహన కల్పించండి
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

అయోడిన్‌ ప్రయోజనాలపై అవగాహన కల్పించండి

చిత్తూరు(వైద్యవిభాగం): అయోడిన్‌ ఉప్పు ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి తెలిపారు. ఈ నెల 21వ తేదీన జాతీయ అయోడిన్‌ లోప రుగ్మతుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు విధిగా అవగాహన కార్యక్రమాలను చేపట్టి అయోడిన్‌ వాడకం, లాభాల గురించి గర్భిణులు, బాలింతలు, తల్లులు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని