భక్తులకు అన్నదానం
eenadu telugu news
Published : 20/10/2021 06:02 IST

భక్తులకు అన్నదానం

భక్తులకు అన్నం వడ్డిస్తున్న సర్పంచి రామచంద్రారెడ్డి 

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం కాలినడకన చెన్నై నుంచి తిరుమలకు వస్తున్న భక్తులకు సోమవారం తిరుచానూరులో అన్నదానం చేశారు. శ్రీమారతి రాయన్‌ భక్త భజన మండలి సభ్యులు దాదాపు 200 మంది కాలి నడకన తిరుమలకు తరలివచ్చారు. వీరికి ఏకవీర సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రతాప్‌ స్వామిజీ ఆధ్వర్యంలో తిరుచానూరు, అలిపిరి వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచి కె.రామచంద్రారెడ్డి, భాజపా నాయకుడు గుండాల గోపినాథ్‌ పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని