సర్దుబాటు పేరుతో దోపిడీ
eenadu telugu news
Published : 20/10/2021 06:02 IST

సర్దుబాటు పేరుతో దోపిడీ

ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా నాయకులు 

జీవకోన(తిరుపతి): విద్యుత్తు, గ్యాస్, పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచేసి జనంపై భారం మోపుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. విద్యుత్తు బిల్లు ద్వారా ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్రూఆఫ్‌ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ తిరుపతి నగరం జీవకోన పరిధిలోని 36, 46, 47, 48 డివిజన్లలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ స్థానికులకు ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల్లో సర్దుబాటు పేరుతో చేస్తున్న దోపిడీ చేస్తోందని వివరించారు. తెదేపా సర్కారు హయాంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగితే చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని రాష్ట్రం తన వాటాగా తీసుకుంటున్న పన్ను నుంచి లీటర్‌పై రూ.5 తగ్గించారని గుర్తుచేశారు. జగన్‌ సర్కారు తగ్గించకపోగా అద]నపు వసూళ్లతో జనం నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సుధాకర్, శ్రీరాములు, లక్ష్మీ, కుమారమ్మ, పైపుల రవి, నాగరాజు, కార్పొరేటర్‌ ఆర్‌.సి.మునికృష్ణ, మునిశేఖర్‌రాయల్, ఊట్ల సురేంద్రనాయుడు, బుల్లెట్‌ రమణ, రుద్రకోటి సదాశివం, రవినాయుడు, బ్యాంకు శాంతమ్మ, మైనం బాలాజీ, మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని