రహదారుల నిర్మణానికి భూసేకరణ పూర్తి చేయండి
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

రహదారుల నిర్మణానికి భూసేకరణ పూర్తి చేయండి


వీడియో సమావేశంలో కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: జాతీయ రహదారుల నిర్మాణం నిమిత్తం భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఏఐ, రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే, చిత్తూరు-నాయుడుపేట, చిత్తూరు-తచ్చూరు హైవే పెండింగ్‌ పనుల్లో పురోగతి సాధించాలన్నారు. మదనపల్లె-పీలేరు, పీలేరు-చెర్లోపల్లె, మదనపల్లె-రాయచోటి, మదనపల్లె-పలమనేరు, పలమనేరు-తిరువణ్ణామలై హైవేలో పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జేసీ రాజాబాబు, మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఆర్డీవో రేణుక, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ హరికృష్ణ, ఈఈలు ఓబుల్‌రెడ్డి, అబ్దుల్‌సలాం పాల్గొన్నారు.

l ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. సచివాలయ భవనాల నిర్మాణాలు డిసెంబరు 31లోగా పూర్తిచేయాలని, ఈ-క్రాప్‌ నమోదు, శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీలు రాజాబాబు, శ్రీధర్‌, వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. l వైఎస్‌ఆర్‌ భూహక్కు-భూరక్ష పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. రీసర్వే చేపట్టిన నాలుగు గ్రామాల్లో 1,629 రెవెన్యూ ఖాతాలకు చెందిన భూములకు డ్రోన్‌ సర్వే, ఓఆర్‌ఐ షీట్లు, గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పనులు పూర్తయ్యాయన్నారు. 277 ఖాతాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని