పోలీసుల్లేని సమాజాన్ని ఊహించలేం
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

పోలీసుల్లేని సమాజాన్ని ఊహించలేం

పోలీసు అమరవీరుల సంస్మరణలో జిల్లా జడ్జి పార్థసారథి


చిత్తూరు: మృతుల కుటుంబ సభ్యులను సత్కరిస్తున్న జిల్లా జడ్జి పార్థసారథి తదితరులు

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: రక్షణశాఖలో విధులు నిర్వర్తిస్తూ రాత్రింబవళ్లు శ్రమిస్తూ.. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ వీరమరణం పొందుతున్న వారెందరో ఉన్నారు. అలాంటి అమర వీరులకు ఉన్నతాధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గురువారం అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని.. శాంతిభద్రతల కట్టడిలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమన్నారు.కలెక్టర్‌ హరినారాయణన్‌ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజం కోసం, భవిష్యత్‌ తరాల కోసం ప్రజారక్షణకు పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఎస్‌ఈబీ జేడీ విద్యాసాగర్‌నాయుడు మృతవీరుల పుస్తకాన్ని స్వీకరించారు. పోలీసుశాఖలో మృతి చెందిన వారి కుటుంబాలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, ఏఎస్పీ మహేష్‌, డీఎస్పీలు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కృష్ణమోహన్‌, లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, తిప్పేస్వామి పాల్గొన్నారు.

తిరుపతి(నేరవిభాగం): సమాజ శ్రేయస్సుకు కుటుంబ సభ్యులను వదిలి శాంతియుత పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద అతిథులు, పోలీసులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కొవిడ్‌ మహమ్మారికి బలైన 8 మంది పోలీసుల కుటుంబ సభ్యులకు నగదు చెక్కులను అందజేశారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ..విధి నిర్వహణకు త్యాగం చేస్తున్న పోలీసులకు రక్షణగా నిలుస్తామని ప్రకటించారు. కొవిడ్‌ నివారణకు నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. తిరుపతి నగర పాలక కమిషనర్‌ గిరీష, తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిపుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

పీటీసీలో ఆయుధాల ప్రదర్శన

చంద్రగిరి గ్రామీణ: కల్యాణీ జలాశయం వద్ద నున్న పోలీసు శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఆయుధాల ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ముందుగా పీటీసీ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ మునిరాజ ఆధ్వర్యంలో అమరవీరులకు వందనం సమర్పించారు.


తిరుపతి ఏఆర్‌ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న పోలీసు అధికారులు

పోలీసు అమరవీరుల కుటుంబానికి నగదు చెక్కును అందజేస్తున్న

మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వీర్రాజు తదితరులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని