డెంగీ జ్వరాలపై అప్రమత్తం
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

డెంగీ జ్వరాలపై అప్రమత్తం


ఇంటింటి సర్వే పరిశీలిస్తున్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామనారాయణరెడ్డి

మదనపల్లె నేరవార్తలు: డెంగీ జ్వరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామనారాయణరెడ్డి అన్నారు. గురువారం స్థానిక త్యాగరాజవీధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగీ నివారణపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌, కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి, గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని