అయోడిన్‌ లోపాన్ని అధిగమించాలి
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

అయోడిన్‌ లోపాన్ని అధిగమించాలి


మాట్లాడుతున్న వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి

కృష్ణదేవరాయకూడలి(తిరుపతి): ప్రతి ఒక్కరూ అయోడిన్‌ లోపంతో కలిగే రుగ్మతలను అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని వినియోగదార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.రాజారెడ్డి అన్నారు. తిరుపతి నగర పరిధి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థల ప్రాంగణంలో జిల్లా వినియోగదార్ల కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అయోడిన్‌ లోపం నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో 30 శాతం మంది అయోడిన్‌ పోషక లోపంతో బాధపడుతున్నవారేనని అన్నారు. ఈ లోపం కారణంగా థైరాయిడ్‌ గ్రంథులు వాయడం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, కంటిచూపు, శారీరక ఎదుగుదల తగ్గిపోతుందన్నారు. శిశువుల్లో బుద్ధిమాంద్యం, చెవుడు వంటి సమస్యలు తలెత్తుతుంటాయని తెలిపారు. అయోడిన్‌ ఉప్పును వాడడం వల్ల సమస్యలకు కొంతమేర పరిష్కారం చూపవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆహార నియంత్రణ అధికారులు జగదీష్‌, రాములు, రాజు, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథరెడ్డి, హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని