తగ్గినా.. సర్దుకోవాల్సిందేనా..!
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

తగ్గినా.. సర్దుకోవాల్సిందేనా..!

సీడ్స్‌ వాటాదారుల అసంతృప్తి


ఏపీసీడ్స్‌లో మాట్లాడుతున్న మాజీ డైరెక్టర్‌ శివశంకర్‌రెడ్డి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఏపీసీడ్స్‌లో ఏటా ఖరారు చేస్తున్న విత్తన లక్ష్యాన్ని యాజమాన్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై వాటాదారులైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో రైతులతో అధికారులు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీసీడ్స్‌ జిల్లా మేనేజరు సుబ్బయ్య మాట్లాడుతూ.. రెండేళ్లుగా వరి వంగడాలు భారీగా నిల్వ చేరడం, తిరిగి విక్రయించక పోవడంతో సంస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ క్రమంలో 2021-22 సంవత్సరానికి విత్తన విస్తీర్ణ లక్ష్యాన్ని తగ్గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని వివరించారు. గతంలో 4,400 ఎకరాలకు ప్రస్తుతం 1685కు తగ్గించిందన్నారు. విత్తన పంపిణీలో తొలుత వాటాదారులకు ప్రాధాన్యమిస్తామన్నారు. రైతుల తరఫున పలువురు మాజీ డైరెక్టర్లు మాట్లాడారు. విస్తీర్ణం తగ్గిస్తే వాటాదారులైన రైతులకు నష్టం కలుగుతుందన్నారు. అన్నీ జిల్లాలకు వర్తిస్తున్న రాయితీని స్థానిక రైతులకు ఇవ్వకపోవడంపై సమావేశంలో చర్చించారు. ఏపీసీడ్స్‌ అభివృద్ధితో పాటు రైతులకు సమస్యలు తలెత్తతకుండా ఇక్కడి అంశాలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వయ్యాల కృష్ణారెడ్డి, మాజీ డైరెక్టర్లు శివశంకర్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, మహదేవరెడ్డి పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని