పుణ్యక్షేత్ర దర్శన అనుభవాలపై పుస్తకావిష్కరణ
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

పుణ్యక్షేత్ర దర్శన అనుభవాలపై పుస్తకావిష్కరణ


వెంకట వినోద్‌ పరిమి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుడైన ఓ ప్రవాస భారతీయుడు రాసిన ‘దైవంతో నా అనుభవాలు-2’ పుస్తకాన్ని గురువారం ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించారు. సింగపూర్‌లో స్థిరపడిన వెంకట్‌ వినోద్‌ పరిమి ఏడాది క్రితం ‘దైవంతో నా అనుభవాలు’ పుస్తకాన్ని రచించారు. పుస్తకానికి ఆదరణ లభించడంతో ‘దైవంతో నా అనుభవాలు-2’ పుస్తకాన్ని రచించారు. శ్రీవారి భక్తుడైన ఆయన సంవత్సరంలో పది పర్యాయాలు తిరుమలకు వచ్చి వెళుతుంటారు. అలా 30 ఏళ్లలో తిరుమలతోపాటు, భారతదేశంలో దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటనలో కలిగిన అనుభవాలను పుస్తకంలో ఆయన పొందుపరిచారు. కరోనా నేపథ్యంలో భారతదేశానికి రాలేకపోయిన రచయిత ఆన్‌లైన్‌లోనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో తాను రాసిన దైవంతో నా అనుభవాలు మొదటి వాల్యుం విక్రయం ద్వారా వచ్చిన రూ.లక్ష నగదును తితిదే గో సంరక్షణ ట్రస్టుకు సన్నిహితుల ద్వారా తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందించారు. మరో రూ.లక్షను తితిదే గోసంరక్షణ ట్రస్టుకు వారం రోజుల క్రితం అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని