విద్యుదాఘాతంతో తమిళనాడు వాసి మృతి
eenadu telugu news
Published : 22/10/2021 05:20 IST

విద్యుదాఘాతంతో తమిళనాడు వాసి మృతి


విక్రమ్‌ (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు: విద్యుదాఘాతంతో తమిళనాడు వాసి మృతి చెందిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి మండలం దొనగుట్ట పంచాయతీ ఎరిమూరు గ్రామానికి చెందిన మహేంద్ర, అలిమేలు కుమారుడు విక్రమ్‌(32) కొన్ని రోజుల కిందట మదనపల్లె సమీపంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి క్వారీ సమీపంలో పిడుగు పడటంతో ఇతను నిద్రిస్తున్న ప్రాంతంలోనే ఉన్న విద్యుత్తు తీగలు కాలిపోయాయి. ఈ క్రమంలోనే విక్రమ్‌ నిద్రిస్తున్న ఇనుప మంచానికి విద్యుత్తు సరఫరా అయి షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను సహచరులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమార్తె సాధన(7), కుమారుడు సిద్ధార్థ(5) ఉన్నారు. ఇంటి పెద్ద మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్సై సోమశేఖర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని