క్రీడాస్ఫూర్తి పెంచుకోవాలి: జడీ్ప ఛైర్మన్‌
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

క్రీడాస్ఫూర్తి పెంచుకోవాలి: జడీ్ప ఛైర్మన్‌

ముగిసిన దక్షిణ భారత స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు

విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్లతో ముఖ్య అతిథులు

మదనపల్లె విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని పెంచుకుని భవిష్యత్తులో జరిగే పోటీల్లో రాణించాలని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం కురబలకోట మండలం అంగళ్లులోని గోల్డెన్‌ వ్యాలీ విద్యాసంస్థల మైదానంలో నిర్వహించిన సీనియర్‌ సౌత్‌ జోన్‌ షూటింగ్‌బాల్‌ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర అకడమిక్‌ మానిటరింగ్‌ కమిటీ కమిషనర్‌ ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, రెడ్డిశ్రీనివాస్‌ నరేష్‌, సాయిశేఖర్‌, చంద్రశేఖర్‌, టి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

విజేతలు వీరే.. పురుషుల ఫైనల్స్‌ పోటీల్లో కేరళపై తలపడిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచింది. తమిళనాడు జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది. మహిళల విభాగం ఫైనల్స్‌ పోటీల్లో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్‌ జట్టు గెలుపొందింది. మూడో స్థానంలో కర్ణాటక జట్టు నిలిచింది. విజేతలకు ముఖ్య అతిథులు జ్ఞాపికలు అందజేశారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఎక్కువ పాయింట్లు సాధించిన ఆంధ్రా జట్టులోని మహమ్మద్‌ యూసుఫ్‌(మదనపల్లె), శాంతి(కృష్ణా జిల్లా) ఉత్తమ క్రీడాకారులుగా బహుమతులు అందుకున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని