పడమటి మండలాల ప్రగతే లక్ష్యం
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

పడమటి మండలాల ప్రగతే లక్ష్యం

పీకేఎం ఛైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి

మదనపల్లె పట్టణం: జిల్లాలోని పడమటి మండలాలను అభివృద్ధి చేయడానికే పలమనేరు, కుప్పం, మదనపల్లె (పీకేఎం) పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మదనపల్లెలో ఈ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రథమ ఛైర్మన్‌గా నియమితులైన వెంకటరెడ్డియాదవ్‌తో సబ్‌కలెక్టర్‌ జాహ్నవి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. వెంకట్‌రెడ్డియాదవ్‌ మాట్లాడుతూ.. పీకేఎం పరిధిలోని మండలాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎం.నవాజ్‌బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, మదనపల్లె, పుంగనూరు మున్సిపల్‌ ఛైర్మన్లు మనూజ, అలీంబాషా, ఏపీ ఎండీసీ ఛైర్‌పర్సన్‌ షమీంఅస్లాం, వెంకటచలపతి, నూర్‌ఆజామ్‌, ఎంపీపీ రెడ్డెమ్మ పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని