వేరుసెనగవిత్తనంఇచ్చేనా..?
eenadu telugu news
Published : 25/10/2021 06:16 IST

వేరుసెనగవిత్తనంఇచ్చేనా..?

న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం) రబీ సీజన్‌ మొదలై ఇరవై రోజులు దాటింది. జిల్లాలో రాయితీ వేరుసెనగ విత్తన కాయల పంపిణీ ఏర్పాట్ల ఊసే లేదు.. వాటి ధరలు నిర్ణయించనే లేదు. తద్వారా విత్తనకాయల సేకరణ ప్రక్రియ జాప్యం కానుంది.. ఫలితంగా వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ వేరుసెనగ పంట అధిక వర్షాలతో దెబ్బతిని నష్టపోయిన రైతులు రబీ వేరుసెనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్‌లో వేరుసెనగ సాధారణ విస్తీర్ణం 12,890 హెక్టార్లు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లాకు 13,500 క్వింటాళ్ల రాయితీ వేరుసెనగ విత్తనాన్ని కేటాయించింది. సాధారణంగా ఏటా అక్టోబరు మొదటి వారంలోనే వేరుసెనగ విత్తనం పంపిణీ జరిగేది. ఈ ఏడాది అసలు వాటిని ఎప్పుడిస్తారో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్‌ వేరుసెనగ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని జేడీఏ దొరసాని తెలిపారు. ధరలు ఖరారు కాగానే వీలైనంత త్వరగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని